బాధితులకు జనసేన వితరణ

Mar 7,2024 00:30

ప్రజాశక్తి – వేమూరు
మండలంలోని చావలి గ్రామంలో ఇటీవల జరిగిన అగ్రి ప్రమాదంలో పూర్తిగా ఇళ్లు కాలిపోయి నిరాశ్రములైన సిగిరిశెట్టి యానాధరావు కుటుంబానికి జనసేన నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రమాదంలో ఇంటితో పాటు వస్తువులు కూడా పూర్తిగా కాలిపోయి కట్టుబట్టలతో మిగిలిన యానాదిరా కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని జనసేన నాయకులు ఊసా రాజేష్ తెలిపారు. కుటుంబానికి 75 కేజీల బియ్యంతో పాటు రూ.50వేల విలువైన సామాగ్రి, నిత్యవసర వస్తువులు అందజేశారు. కార్యక్రమంలో చావలి గ్రామ సర్పంచ్ విష్ణుమొలకల శ్రీనివాసరావు, జనసేన మండల ఉపాధ్యక్షులు దాది సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కాలువ గుప్తా, గ్రామ ఉపాధ్యక్షులు రమేష్, రంగా, తిరుపతిరావు, పెద్దయ్య, చాపల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️