బాలికలకు పోషకాహార కిట్లు పంపిణి

Mar 31,2024 23:56 ##Rotary #Marturu

ప్రజాశక్తి – మార్టూరు రూరల్
పోషకాహార లోపంతో బాలికలు అనారోగ్య సమస్యలకు గురి కాకుండా వారి సంరక్షణే లక్ష్యంగా ఎఫర్ట్ సంస్థ కృషి చేస్తుందని ఆ సంస్థ డైరెక్టర్ జాష్టి వెంకట మోహనరావు, జాష్టి అనురాధ పేర్కొన్నారు. రంజాన్ మాసం సందర్బంగా స్థానిక ఎఫర్ట్ కార్యాలయంలో 100మంది పేద ముస్లిం కుటుంబాలకు చెందిన బాలికలకు అమెరికాకు చెందిన ఏకం సంస్థ ఆర్ధిక సహకారంతో 15రకాల పౌష్టికాహార కిట్లను ప్రత్యేకంగా తయారు చేయించి ఆదివారం అందచేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బాలికలు చదువు ద్వారానే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని అన్నారు. అటువంటి వారికి సరైన పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉండి మెరుగైన ఫలితాలు సాధిస్తారని అన్నారు. నిరుపేద బాలికల సంరక్షణ కోసం ఎఫర్ట్ సంస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఇంటూరి ఆంజనేయులు, రోటరీ అధ్యక్ష, కార్యదర్శులు తాళ్లూరి సాంబశివరావు, మద్దుమాల కోటేశ్వరరావు, ఈశ్వరప్రసాద్, మాజీ అధ్యక్షులు శానంపూడి లక్ష్మయ్య, షేక్ ఖాజా హుస్సేన్, చెన్నుపాటి బసవరాములు, రావి అంకమ్మచౌదరి పాల్గొన్నారు.

➡️