సబ్సిడీపై వరి విత్తనాలు పంపిణీ

ప్రజాశక్తి – చెరుకుపల్లి
రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, కావలసిన రైతులు తమ గ్రామ వ్యవసాయ సహాయకులను కలిసి పొందాలని ఎఒ టి బాలాజీ గంగాధర్ తెలిపారు. బిపిటి 5204, ఎంటియు 1224 రకం సబ్సిడీ పోను 25కేజీలు రూ.920, ఎంటియు 1061 రకం 30కేజీలు సబ్సిడీ పోను రూ.1044 చెల్లించి పొందాలని కోరారు. రైతులు తమ ఆధార్ కార్డు, పాస్ బుక్ జిరాక్స్ తీసుకొని రావాలని కోరారు. విత్తనాలను కొనేటప్పుడు రైతులు తప్పనిసరిగా లాట్ నెంబర్, గడువు తేదీని చూసుకొని కొనాలని సూచించారు. తప్పనిసరిగా రసీదు పొందాలని చెప్పారు. మండలంలోని విత్తన దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనాలని సూచించారు.


భట్టిప్రోలు : మండలంలోని పల్లికోనలో బాపట్ల వ్యవసాయ ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు వరి పంటపై వ్యవసాయ శిక్షణ తరగతులు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఆర్ బాల మురళీధర్ నాయక్, ఆర్ రాధాకృష్ణ రైతులకు అవగాహన కల్పించారు. చిరుధాన్యాల సాగు ఆవశ్యకతను వివరించారు. చిరుధాన్యాల వినియోగం మనిషికి ఆరోగ్యానికి దోహదపడతాయని చెప్పారు. రైతులు వ్యవసాయం పట్ల అవగాహన కలిగి తక్కువ ఖర్చులతో అధిక దిగుబడులు సాధించే విధంగా మార్పులు చేసుకోవాలని చెప్పారు. రైతులకు బిపిటి 2858, నవారా విత్తనాల శాంపిల్ ప్యాకెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఎఒ గొల్లపోతు మీరయ్య, వీఏఎలు యుగంధర్, గోకుల్ కృష్ణ, మాజీ సర్పంచ్ మండవ రామకోటేశ్వరరావు పాల్గొన్నారు.
వేమూరు : ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు ప్రభుత్వం నుండి రాయితీపై వరి విత్తనాలు అందించేందుకు ఆర్‌బికెల్లో సిద్ధంగా ఉన్నాయని ఎఒ సిహెచ్ సునీత తెలిపారు.

➡️