డాక్టర్‌ పాలేటి ఆధ్వర్యంలో చీరల పంపిణీ

Dec 24,2023 00:04

ప్రజాశక్తి – చీరాల
క్రిస్టమస్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం ఆనందంగ ఉందని ప్రజా వేదిక, ఐక్య క్రిస్టియన్ జెఎసి వ్యవస్థాపకులు గుమ్మడి ఏసురత్నం అన్నారు. పట్టణంలోని మరియంపేటలో రోమన్ క్యాథలిక్ మిషన్ ఆర్సిఎం చర్చిలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. పాస్టర్ జంగిలి ఏసురత్నం ప్రార్థన చేసి దేవుని వాక్యం బోధించారు. కార్యక్రమంలో రేవరెడ్‌ గుమ్మడి రత్న ప్రకాష్, మన్నం ప్రతాప్ పాల్గొన్నారు.

➡️