నాణ్యమైన వైద్యసేవలు అందిస్తాం : లత హాస్పిటల్ ఎండి డాక్టర్ రాజ్ కుమార్

Jun 16,2024 23:20 ##Chirala #Latha #Hospital

ప్రజాశక్తి – చీరాల
వైద్య వృత్తి ఎంతో విలువైనదని, అత్యవసర వైద్య సేవలకు దూరప్రాంతాలకు వెళ్లకుండా నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో లతా హాస్పిటల్ ప్రారంభించినట్లు హాస్పిటల్ ఎండి డాక్టర్ రాజ్ కుమార్ అన్నారు. స్థానిక లత హాస్పిటల్‌లో ప్రాథమిక వైద్యుల అవగాహన సదస్సు డాక్టర్ తులసి రామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవలకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఆధునిక వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండేలా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. తమ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చీరాల, వేటపాలెం, ఇంకొల్లు పరిసర ప్రాంతాల ప్రాథమిక వైద్యులు అందరూ తమ హాస్పిటల్‌లో అందిస్తున్న వైద్య సేవలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లి దూర ప్రాంతాలకు వెళ్లకుండా తమ హాస్పటల్లో అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం ప్రాథమిక చికిత్సకు అవసరమైన వైద్య పరికరాన్ని గ్రామీణ వైద్యులకు అందజేశారు. ఆత్మీయ సమావేశంలో చీరాల అసోసియేషన్ ప్రెసిడెంట్ సాంబశివరావు, వేటపాలెం అసోసియేషన్ కె వరప్రసాద్, ఇంకొల్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

➡️