మండల అభివృద్ధికి కృషి చేయాలి

Dec 14,2023 00:29

ప్రజాశక్తి – కర్లపాలెం
మండలం సరసభ్య సమావేశం ఎంపీపీ యారం వనజ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీఒ రాంబాబు మాట్లాడుతూ అభివృద్ధికి, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలని అన్నారు. నల్లమోతు వారిపాలెం ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశం ఎప్పుడు జరిగిన ఏ ఒక్క అధికారీ పాల్గొనడం లేదని అన్నారు. వాళ్ళ కిందిస్థాయి ఉద్యోగలను పంపుతున్నారని అన్నారు. దీనిపై అధికారులు సమాధానం చెప్పాలని కోరారు. ఇలా అయితే ప్రజల సమస్యలు మీకు ఏ విధంగా తెలుస్తాయని ప్రశ్నించారు. ఈసారి జరిగే సమావేశానికి అధికారులు అందరూ హాజరు కావాలని కోరారు. ఉన్నతాధికారులకు పిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

➡️