ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సౌకర్యం

Nov 29,2023 23:35

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని పెదపులివర్రు పంచాయతీ పరిధిలోని గుత్తావారిపాలెంలో ఉన్న జెడ్‌పి ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాల, పశువైద్యశాల, ఆర్బికెలలో విద్యుత్ సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో సర్పంచ్ నీళ్ల ఉషారాణి, మంత్రి నాగార్జున దృష్టికి తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న మంత్రి నాగార్జున తక్షణం విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని సంబంధిత విద్యుత్ డిఏని ఆదేశించారు. ఎక్స్ప్రెస్ ఫీడర్ మీద లైన్ కలిపి విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించటంతో విద్యుత్ సిబ్బంది గ్రామంలోని గాజులపేట వద్ద ఎక్స్‌ప్రెస్ గడ్డలపై విద్యుత్ లైన్ కలపడంతో కార్యాలయానికి విద్యుత్ సౌకర్యం ఏర్పడిందని సర్పంచ్ ఉషారాణి తెలిపారు. మంత్రి చొరవతో ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడం అభినందనీయమని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైసిప నాయకులు నీల నాగరాజు, నీల రమేష్, కొనకాల శ్రీను, విద్యుత్తు లైన్‌మెన్ రవి, పంచాయతీ కార్యదర్శి చౌరీ జోషి పాల్గొన్నారు.

➡️