ఉద్యోగస్తులు చిత్తశుద్ధితో పనిచేయాలి

Jun 18,2024 00:40 ##Bapatla #MLA #Narendravarma

ప్రజాశక్తి – బాపట్ల
ప్రభుత్వ ఉద్యోగుల చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు ఆయనను తన ఇంటి వద్ద మర్యాద పూర్వకంగా సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన పథకాలు అర్హులందరికీ అందే విధంగా చూడాలని అన్నారు. సొంత నిర్ణయాలతో ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు బలపర్చారని అన్నారు. మునిపెన్నడూ లేని విధంగా బాపట్లలో అత్యధిక మెజారిటీతో తనకు విజయం చేకూర్చారని అన్నారు. టిడిపిపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు సేవలు అందించేందుకు ఉద్యోగులు పూర్తిస్థాయిలో పని చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె రోశయ్య, కార్యదర్శి పి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు పి అమ్మయ్య, బేనర్జి, ఉదయ్ గోపి, రత్నకూమరి, వేంకటరమణమ్మ, రాంబాబు, సుబ్బరావు పాల్గొన్నారు.

➡️