రైతులను ఆదుకోవాలి : పాలేటి

Dec 8,2023 22:57

ప్రజాశక్తి – చీరాల
తుఫాన్ కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు కోరారు. మండలంలోని బోయినవారిపాలెం పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. రొంపేరు కుడి, ఎడమ కాలువను, సాకి డ్రైను, స్టువర్టుపురం ఛానల్‌, వేటపాలెం మండలం నాయినపల్లి ఎత్తిపోతల పథకం పరిశీలించారు. కాలువలో గుర్రపు డెక్క, తూటి కాడ, బూరగాకు తొలగించి నీటిపారుదల మార్గం చూపాలని సూచించారు. ఆయన వెంట ఎర్రకుల శ్రీనివాసరావు, బోయిన శ్రీనివాసరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు బోయిన కేశవులు, చప్పిడి వెంకటేశ్వర్లు, గవిని శీను, గవిని పకీరయ్య, తలారి శీను, తలారి రాజు ఉన్నారు.

➡️