పండుగలా పెన్షన్ పంపిణీ

Jul 2,2024 01:11 ##Bapatla #tdp #Chandrababu

ప్రజాశక్తి – బాపట్ల
ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ చామకూరి శ్రీధర్‌తో కలిసి మండలంలోని స్టువర్టుపురం, పాండురంగాపురం, జమ్ములపాలెం, బాపట్ల పట్టణం, కర్లపాలెం మండలం పేరలి, కర్లపాలెం, యాజలి, పిట్లవానిపాలెం మండలం చందోలు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ జి రవీందర్, తహశీల్దారు శ్రావణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఈఓఆర్డి పులి శరత్ బాబు, జనసేన ఇన్‌ఛార్జి నామన శివన్నారాయణ పాల్గొన్నారు.


కొల్లూరు : ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు టిడిపి మండల అధ్యక్షులు మైనేని మురళీకృష్ణ, జనసేన అధ్యక్షులు చలమయ్య, ఈఒ మల్లికార్జునరావు తోకలిసి కొల్లూరులో పంపిణీ చేశారు.


పంగులూరు : గ్రామాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు తెలుగుదేశం నాయకులు పూలమాల వేసి పెన్షన్‌ పంపిణీకి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో మహిళా కానిస్టేబుల్ గద్దె అరుణ, తెలుగుదేశం నాయకులు అన్నంగి రవి, నూనె ఇశ్రాయేలు, మంద నాగేశ్వరరావు, పాలపర్తి లోకయ్య, ధారా కిరణ్ కుమార్, నూనె రాజేష్, అట్లూరి లాజర్, పాలపర్తి చిన్న శేషయ్య, తాతపూడి శ్యాంబాబు పాల్గొన్నారు.


అద్దంకి : మండలంలోని చినకొత్తపల్లి, వెంపరాల, గోవాడ, తిమ్మాయపాలెం, రామాయపాలెం, పార్వతీపురం, కోటికలపూడి తదితర గ్రామాల్లో వృద్ధుల చేత కేక్ కట్ చేసి సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, గొట్టిపాటి రవికుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
యద్దనపూడి : పెన్షన్ల పంపిణీలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా మార్క్ ఫెడ్ మేనేజర్ కె కరుణశ్రీ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలని చెప్పారు. కార్యక్రమంలో ఇఒఆర్‌డి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి శ్రీను పాల్గొన్నారు.


సంతమాగులూరు : మండలంలోని పుట్టావారిపాలెంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు సన్నెబోయిన గురు యాదవ్, మాజీ ఎంపీపీ సన్నెబోయిన ఏడుకొండలు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. కొప్పరం నెహ్రు నగర్ కాలనీలో టిడిపి నాయకులు అట్లా పెద్ద వెంకటరెడ్డి, చేవూరి వాసురెడ్డి, పూల రాము ఆధ్వర్యంలో పింఛన్లను అందజేశారు. ఏల్చూరులో మాజీ సొసైటీ అధ్యక్షులు డి గాలెయ్య ఆధ్వర్యంలో పింఛన్లను అందజేశారు.


వేమూరు : సిఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు జూలై 1నుండి రూ.4వేలు పెన్షన్‌తో పాటు గడిచిన మూడు నెలలకు రూ.3వేలు కలిపి రూ.7వేలు పెన్షన్ పంపిణీ చేశారు. అక్కడక్కడ సర్వర్ సమస్యలు ఎదురైనప్పటికీ 90శాతంపైగా పంపిణీ పూర్తి చేశారు. మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ నక్కా ఆనందబాబు కొల్లూరు, భట్టిప్రోలు, అమర్తలూరు, చుండూరు, జంపని గ్రామంలో పంపిణీ చేశారు.


కారంచేడు : పింఛన్లను 95 శాతం పంపిణీ పూర్తి చేసినట్లు ఎంపీడీఒ బి బాబురావు తెలిపారు. మండలంలో 6086మందికి పంపిణీ జరిగినట్లు తెలిపారు. తనతోపాటు తహశీల్దారు మెహర్ బాబు, ఈఒఆర్డి ఆర్ రమేష్ బాబు, ఎఒ లక్ష్మీనారాయణ పర్యవేక్షించినట్లు తెలిపారు. కారంచేడులో ఎఎంసి మాజీ చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య చౌదరి, కంభంపాటి శ్రీనివాసరావు, పి ఆదిలక్ష్మి, నానీలు ప్రారంభించారు.


భట్టిప్రోలు : పెన్షన్ల పంపిణీని టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు బట్టు మల్లికార్జునరావు ప్రారంభించారు. ఐలవరంలో టిడిపి నాయకులు మాచర్ల నాగరాజు ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ నీలం దేవరాజ్, ఎంపీడీఒ మల్లికార్జునరావు, తహశీల్దారు ఐ మునిలక్ష్మీ పాల్గొన్నారు.


నగరం : మండలంలోని చినమట్లపూడి, పెదమట్లపూడి గ్రామాల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పెన్షన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు చింతల సుబ్బారావు, మాజీ జడ్పిటిసి మేక వెంకట శివరామకృష్ణ, పెదమట్లపూడి మాజీ సర్పంచి లుక్క గుడారంకయ్య, తహశీల్దారు, ఎండీఒ పాల్గొన్నారు.


మేదరమెట్ల : బొడ్డువాణిపాలెంలో తహశీల్దారు పి సుశీల, దైవాలరావూరు, రావినూతల గ్రామాల్లో ఏఓ పి శ్రీనివాసరావు, మేదరమెట్లలో పంచాయితీ కార్యదర్శి జె లక్ష్మీకాంత్ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు.


ముండ్లమూరు : మండలంలోని 21పంచాయతీలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెంచిన రూ.4పెన్షన్‌ టిడిడి ఇన్‌ఛార్జి గొట్టిపాటి లక్ష్మి పంపిణీ చేశారు. సింగనపాలెంలో నేరుగా లబ్దిదారులను కలిసి అందజేశారు. కార్యక్రమంలో కడియాల లలిత సాగర్, కూరపాటి శ్రీనివాసరావు, మాజీ జడ్పిటిసి వరగాని పౌలు, కొక్కెర నాగరాజు, మానవ నరసింహారావు, కందిమల్ల చంద్రమౌళి, బత్తిన వెంకటరావు, శివరామకృష్ణ, ఈఓఆర్డి శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి అంజమ్మ పాల్గొన్నారు.


వేటపాలెం : ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను కొత్తపేట, దేశాయిపేట, రామన్నపేట, వేటపాలెం, పందిళ్ళపల్లి పంచాయతీల్లో ఎంఎల్‌ఎ ఎంఎం కొండయ్య పంపిణీ చేశారు. అక్కాయపాలెం పంచాయతీ లక్ష్మీపురంలో ఆర్‌డిఒ పి సూర్యనారాయణ రెడ్డి, తహశీల్దారు పి కృష్ణ కాంత్, ఎంపీడీఒ ఎంవిఎస్ శర్మ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు జాగబత్తుని పోతురాజు, వెంగళ భరత్, శమ్మి, అందే శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, సెక్రెటరీ బడుగు రమేష్, శ్రీనివాసరావు, శవనం రాజశేఖరరెడ్డి, పూర్ణకుమారి, కొమ్మనబోయిన శివలీల, బాలిగ సురేంద్ర, పి శారద పాల్గొన్నారు.


పర్చూరు : మండలంలోని దేవరపల్లిలో ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.4వేలకు ఏప్రిల్‌ నెలనుండే పెంచి ఇస్తున్నట్లు తెలిపారు. గడిచిన మూడునెలల పెండింగ్‌ రూ.3వేలతో జున్‌నెల రూ.4వేలు కలిపి రూ.7వేలు అందజేసినట్లు తెలిపారు. వృద్దులు, వితంతులు, వికలాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

➡️