తుఫాను బాధ్యతులకు ఆర్థిక సాయం

Jan 19,2024 23:44

ప్రజాశక్తి – బాపట్ల
ఇటీవల కురిసిన తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులకు దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటుందని డిబిఆర్‌సి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అల్లాడి దేవకుమార్ తెలిపారు. పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీ, మాదాల నారాయణస్వామి కాలనీలో తుఫాను బాధి నిరుపేద కుటుంబాల్లో ఎంపిక చేసిన 125మందికి రూ.4వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాపట్ల, చీరాల ప్రాంతాల్లో తుఫానుతో ఇబ్బందులు ఎదుర్కొన్న 350మంది పేదలకు ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. డిబిఆర్‌సి సిటీ కో-ఆర్డినేటర్ ఎన్ శ్రీలత మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్న నేటికీ అనేకమంది యానాది కుటుంబాలు నివేశన స్థలాలు లేక కాల్వ కట్టలపైనే జీవనం సాగిస్తున్నారని అన్నారు. చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న వీరి స్థితిగతులు గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా చైతన్యం కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం మేనేజర్ సిహెచ్ అనిల్ కుమార్, రీజినల్ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️