బోరా మాదిగ పల్లెలో అగ్నిప్రమాదం

Jun 16,2024 23:17 ##Nagaram #Fire #Accident

ప్రజాశక్తి – నగరం
మండలంలోని బెల్లవారిపాలెం గ్రామంలోని బోరా మాదిగపల్లిలో పసుపులేటి కోటేశ్వరరావుకు చెందిన పది ఎకరాల గడ్డివామి, పశువుల చావిడి అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో గొడ్ల చావిడిలో ఉన్న రెండు పాడి గేదెలు, రెండు దూడలు పూర్తిగా కాలి మృతి చెందాయి. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో రూ.5లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. ఘటన సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులో తీసుకొచ్చారు. పశువులు కాలి చనిపోవడం గ్రామస్థులను కలచివేసింది.

➡️