రోటరీ క్లబ్‌కు ఐదు అవార్డులు

Jun 16,2024 23:13 ##Bapatla #Rotary

ప్రజాశక్తి – బాపట్ల
రోటరీ క్లబ్‌కు ఐదు ప్రతిష్టాక అవార్డులు లభించాయని క్లబ్ కార్యదర్శి కోళ్లపూడి ఉపేంద్రగుప్త విలేకరులకు ఆదివారం తెలిపారు. భద్రాచలం ఏటపాక సీతారామ కన్వెన్షన్ హాల్లో శని, ఆదివారాల్లో జరిగిన రోటరీ డిస్ట్రిక్ట్ 3150 కాన్ఫరెన్స్ అవార్డు కార్యక్రమంలో బాపట్లకు అవార్డులు దక్కాయన్నారు. 2024-25కు రోటరీ క్లబ్ ద్వారా సేవలు అందించి ఇంతకంటే ఎక్కువ అవార్డులు సాధిస్తామని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు రావూరి వీరరాఘవయ్య, మాజీ అధ్యక్షులు కొల్ల శ్రీనివాసరావు, అసిస్టెంట్ గవర్నర్ ఎం సుధీర్ కుమార్ పాల్గొన్నారు.

➡️