ఉచిత కంటి వైద్య శిబిరం

Dec 14,2023 23:21

ప్రజాశక్తి -రేపల్లె
పట్టణంలోని శ్రీ చైతన్య కాలేజీలో ఫోకస్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఐ కేర్ వ్యవస్థాపకులు కె కిషోర్ బాబు ప్రారంభించారు. 200మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. అతి తక్కువ ఖర్చుతో మందులు, కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. ఈ సంద్భంగా కె కిషోర్ బాబు మాట్లాడుతూ కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే తాజా ఆకు కూరలు, విటమిన్‌ ఎ, పాలు ఆహారంలో ఎక్కువగా తీసుకోలని అన్నారు. ల్యాప్‌ టాప్స్‌, కంప్యూటర్లు అధికంగా వినియోగించ వద్దని అన్నారు. కంప్యూటర్‌ వినియోగం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్య సిబ్బంది విద్యార్థులకు వివరించారు. ఖర్చు లేకుండా కంటి ఆరోగ్యాన్ని పరిక్షించుకునే చిట్కాలను విద్యార్థులకు తెలిపారు. ఈ శిబిరం మూడు రోజులపాటు జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

➡️