గణేష్ విజయానికి కృషి చేయాలి

Dec 28,2023 00:29

ప్రజాశక్తి – రేపల్లె
వైసిపి అధిష్టానం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియతులైన డాక్టర్ ఈవూరి గణేష్ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు సూచించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన పరిచయ సభలో గణేష్‌ను ప్రతి నాయకునికి పరిచయం చేశారు. సిఎం వైఎస్‌ జగన్‌ వై నాట్ 175సీట్లు సాధించాలని దృక్పథంతో కుల సమీకరణలో భాగంగా గణేష్‌కు ఇన్‌ఛార్జిగా పదవి అప్పగించారని మరోసారి సిఎం జగన్మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అన్నారు. అండగా ఉండి గణేష్ విజయానికి కృషిచేసి, జగనన్నను సిఎం చేసుకోవడానికి కార్యకర్తలు పనిచేయాలని సమయం ఆసన్నమైనదని తెలిపారు. వ్యక్తిగత దూషణలను పక్కనపెట్టి అభ్యర్థిని కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. వైసిపి ప్రభుత్వం మరల అధికారంలోకి రావడానికి సంక్షేమ పథకాలే పునాది అని అన్నారు. అర్హలైన ప్రతి ఒక్కరికి పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసిపి ప్రభుత్వానీదేనని, గతంలో పథకాలు అరకొరగా పచ్చ టిడిపి వారికే దక్కేవని, నేడు రాష్ట్రంలో అలాంటిదేమీ లేదని, ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్న సంగతి జగమెరిగిన సత్యం అన్నారు. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దేవినేని మల్లిఖార్జునరావు మాట్లాడుతూ అందరం కలిసి పార్టీ సూచించిన అభ్యర్థి విజయానికి కృషి చేసి మరల సిఎంగా జగనన్నను ఎంపిక చేసుకోవడం ద్వారా సంక్షేమ రాష్ట్రంగా మారుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని కోరారు. నూతన ఇన్‌ఛార్జి డాక్టర్ గణేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వైసిపి జెండాను ఎగరవేస్తామని అన్నారు. ప్రతి గ్రామంలో మోపిదేవి సహకారంతో ప్రతి గృహాన్ని సందర్శించి, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని తెలిపారు.

➡️