ప్రయాణికుల కోసం గిఫ్ట్ స్కీం

Dec 19,2023 00:37

ప్రజాశక్తి – బాపట్ల రూరల్
అర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పెదనందిపాడు ప్రయాణికుల కోసం బాపట్ల డిపో అధ్వర్యంలో గిఫ్ట్ స్కీం ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ టీ శ్రీనివాసరావు తెలిపారు. పెదనందిపాడు రూట్ బస్సుల్లో ప్రయాణికులకు గిఫ్ట్ స్కీం ప్రవేశపెట్టామని అన్నారు. ఆ మార్గంలో తిరుగు నాలుగు బస్సుల్లో గిఫ్ట్ స్కీం తాలుకు గిఫ్ట్ బాక్స్ లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు బస్సు దిగేటప్పుడు టికెట్ వెనుక చిరునామా, ఫోన్ నెంబరు రాసి ఆ గిఫ్ట్ బాక్సులో వేయాలని అన్నారు. అలా వేసిన టికెట్లను నెలకు రెండు సార్లు డ్రా తీసి విజేతలకు బహుమతులు ఇస్తామని అన్నారు. డిసెంబర్ 1నుంచి 17వరకు, 17నుండి 31వరకు అందరి సమక్షంలో డ్రా తీస్తామని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. డిసెంబర్‌ 1నుండి ప్రయాణించిన ప్రయాణికుల్లో కాకుమానుకు చెందిన ఎం రత్నకుమార్ ప్రధమ, 6వ మైలురాయికి చెందిన సీహెచ్ రాజ్యలక్ష్మి ద్వితీయ, బాపట్లకు చెందిన పీ వెంకాయమ్మ తృతీయ బహుమతి సాధించారని తెలిపారు. ప్రయాణికుల సోమవారం డ్రా తీసి విజేతలను ప్రకటించారు.

➡️