బాలికల వాలీబాల్ శిక్షణ ప్రారంభం

May 22,2024 23:46 ##Wallyball #Panguluru

ప్రజాశక్తి – పంగులూరు
ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలికల వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం మండలంలోని బూదవాడ జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో హెచ్‌ఎం బంగారు కొండ బుధవారం ప్రారంభించారు. ఉమ్మడి ప్రకాశం వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు వారాల పాటు శిక్షణ జరుగుతుందని కో ఆర్డినేటర్ పిడి ఎం వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం ఆంజనేయులు మాట్లాడుతూ శిక్షణ శిబిరానికి జిల్లా నుండి ప్రతిభ గల 30 మంది బాలికలను ఎంపిక చేసినట్లు తెలిపారు. శిక్షణ ఉపయోగించుకొని క్రీడల్లో మంచి ప్రావీణ్యత సాధించాలని కోరారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్ఆర్ కోచ్ కెవి రమణ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ ట్రెజరర్ నరసింహారావు, గ్రామ ఉపసర్పంచ్ గాదె బ్రహ్మారెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ ఈమని శ్రీరాములురెడ్డి, గ్రామపెద్దలు కొమ్మారెడ్డి సుబ్బారెడ్డి, ఈమని బలరామిరెడ్డి, బుల్లిరెడ్డి, రాఘవరెడ్డి, వజ్రాల శ్రీనివాసరెడ్డి, సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు సోడా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

➡️