దర్జీ వృత్తిని ప్రభుత్వం గుర్తించాలి

Feb 28,2024 23:39

ప్రజాశక్తి – బాపట్ల
కుట్టు మిషన్ సృష్టికర్త ఇలియాస్ హో వే జయంతి సందర్భంగా ప్రగతి టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇలియాస్ హోవే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అసోసియేషన్ అధ్యక్షులు వేల్పుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దర్జీ వృత్తిని ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. భవిష్యత్తులో టైలరింగ్ వృత్తిని నేర్చుకునే వారు లేక వృత్తి మనుగుడకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం టైలరింగ్ శిక్షణ కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేసి భవిష్యత్తులో దర్జీ వృత్తిని కాపాడాల్సిన బాధ్యతను గుర్తించాలని అన్నారు. టైలరింగ్ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు అలపర్తి శ్రీనివాసరావు, అలపర్తి నాగేశ్వరరావు, మోదుగుల భాస్కరరావు, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి మాధవరావు, వేల్పూరి శ్రీనివాసరావు, షేక్ జిలాని, షేక్ మౌలా సాహెబ్, పట్టణ ప్రగతి టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్‌కె అల్లాబక్షు, పొన్నాడ శ్రీనివాసరావు, షేక్ పీరా, షేక్ ఖాదర్, మస్తాన్, షేక్ నజీర్ పాల్గొన్నారు.


చీరాల : టైలర్స్‌డే ఘనంగా నిర్వహించారు. వేటపాలెం మండలం కొత్తపేట పంచాయితీ కార్యాలయం వద్ద, చీరాల పట్టణం ఎంజిసి మార్కెట్‌ వద్ద, బాపనమ్మ కళ్యాణ మండపం వద్ద టైలర్స్‌ జెండాలు ఆవిష్కరించారు. విలియం హోవే, కెఎం స్వామి చిత్రపటాలకు నివాళులర్పించారు. కొత్తపేటలో 20మందికి కుటు మిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొత్తపేట మాజీ సర్పంచి చుండూరు వాసు, మాజీ ఎంపిపి దామర్ల శ్రీకృష్ణ, ఎరుకల పోరాట సమితి అధ్యక్షులు ఎన్‌ఎం ధర్మా, దళిత నాయకులు పులిపాటి బాబురావు, కెవిపిఎస్‌ అధ్యక్షులు లింగం జయరాజు, పేర్లి రత్నం, టైలర్స్‌ గౌరవాధ్యక్షులు షేక్‌ మగ్దూంబాష, ఎస్‌ఎ ఆఫీజ్‌, అందె తిరుపతిరావు, అమీనుర్దన్‌, గోలి జేజిబాబు, బిట్ర శ్యామ్‌సుందరరావు, సయ్యద్‌ అజీస్‌, గొర్తి భాస్కరరావు, పావులూరి మారుతీప్రసాదు, షేక్‌ బాష పాల్గొన్నారు.


ఇంకొల్లు : శ్రీ మాతా మహిళా సేవా సంఘం ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆవరణలో టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన ప్రగతి మహిళా మండలి అధ్యక్షురాలు అరి సత్యవతి, ఇంకొలుకు చెందిన షేక్ నసీంను ఘనంగా సత్కరించారు. గత 35ఏళ్లుగా టైలరింగ్ వృత్తిలో కొనసాగుతూ పలువురు మహిళలకు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దారు. ఈసందర్భంగా కుట్టు మిషన్‌ సృష్టికర్త విలియమ్స్ హో వే చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం జండా వందనం చేశారు. కార్యక్రమంలో శ్రీ మాతా మహిళా సేవా సంఘం అధ్యక్షురాలు ఇంటూరి రమణ, కె అనంతమ్మ, కరి శ్రీహరి, కందిమల్ల బిందు మాధవి, జాగార్లమూడి కవిత, రావి మాధవి పాల్గొన్నారు.


అద్దంకి : టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 19వ టైలర్స్ డే స్థానిక ముస్లిం షాదీఖానాలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వ్యక్తిగత సహాయకుడు కె సారథి హాజరయ్యారు. కుట్టు మిషన్ సృష్టికర్త విలియన్స్ హోవే, టైలర్స్ డే కృషి రత్న కెఎం స్వామి చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. పుట్టిన వ్యక్తి నుండి చనిపోయే వ్యక్తి వరకు టైలర్ తోనే పని ఉంటుందని అన్నారు. అందమైన ఆకృతిలో వస్త్రాన్ని కుట్టి అందరి మన్ననలు పొందుతున్న టైలర్స్ అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. టైలర్స్ సమస్యల గళాన్ని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీలో వినిపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. పలువురు సీనియర్ దర్జీలను దుశ్శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నాగినేని రామకృష్ణ, టిడిపి వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ చదలవాడ ఫణీంద్ర బాబు, టిడిపి పట్టణ అధ్యక్షులు చిన్ని శ్రీనివాసరావు, కాకాని అశోక్, తెలుగు యువత అధ్యక్షుడు వడ్డవల్లి పూర్ణచంద్రరావు, టిడిపి మండల మాజీ అధ్యక్షుడు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ధర్మవరపు నాగేశ్వరరావు, కౌన్సిలర్లు కంపా రజని, జహీరా, అత్తులూరి రమేష్, టైలర్స్ యూనియన్ అధ్యక్షుడు గోరంట్ల అచ్చయ్య, షేక్ మదీనా, ఎన్ఆర్ ఖాశిం, షేక్ వలి, కరిముల్లా పాల్గొన్నారు.


మార్టూరు రూరల్ : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న దర్జీల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రావుల బాపయ్య కోరారు. షేక్ ఖాజావలి, పఠాన్ ఖాదర్ వలి ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో బుధవారం నిర్వహించారు. సిపిఐ (ఏంఎల్) రెడ్ స్టార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ బాషా మాట్లాడారు. టైలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉమ్మడి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 45ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటు టైలర్‌గా కొనసాగుతున్న పఠాన్ కాదర్ వలిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ తుర్లపాటి శ్రీనివాసరావు, తగెడ్త ఆంజనేయులు, మహిళా టైలర్స్ అధ్యక్షురాలు మంగళగిరి వెంకట బాల నాగేశ్వరి, షాహిదా పాల్గొన్నారు.


నిజాంపట్నం : స్థానిక మెయిన్ బజార్లో టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా టైలర్స్‌ దినోత్సవం నిర్వహించారు. కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హోవే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించి జెండా ఆవిష్కరించారు. టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ ప్రెసిడెంట్ బొమ్మిడి గాంధీ మాట్లాడుతూ కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హోవే జన్మదినమైన ఫిబ్రవరి 28న ప్రపంచ టైలర్స్ డేను జరుపుకుంటారని చెప్పారు. మనుషుల అందాన్ని రెట్టింపు చేసే విధంగా దుస్తులను కుట్టేది దర్జీని చెప్పారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా దుస్తులను కుట్టడం ఒక మంచి కళని కొనియాడారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎస్‌కె అన్సారీ, సెక్రటరీ చింతా నాగరాజు, వైస్ సెక్రటరీ బొమ్మిడి శ్రీను, ట్రెజరీ కొక్కిలిగడ్డ లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు బి సుబ్బారావు, సిహెచ్ సాయి, నియోజకవర్గ టైలర్స్ ఇన్చార్జి సిహెచ్ సుబ్రహ్మణ్యం, టైలర్స్ జగన్, కె అంతిరాజులు, ఎస్‌కె పార్క్ జానీ, మహిళా టైలర్స్ పాల్గొన్నారు.

➡️