జాబ్ మేళాకు విశేష స్పందన

Nov 27,2023 23:48

ప్రజాశక్తి – మార్టూరు రూరల్
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మినీ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. మార్టూరు కొణిదెన రోడ్డులోని విఎస్ఆర్ అండ్ ఎఎం డిగ్రీ కాలేజ్ నందు నిర్వహించిన జాబ్ మేళాకు 125మంది అభ్యర్థులు హాజరయ్యారు. హెటిరోడ్రగ్స్, ముత్తూట్ ఫైనాన్స్, ఫ్లెక్స్ టెక్ సొల్యూషన్స్, జాయలుకాస్, అల్ సెట్ సొల్యూషన్స్ కంపెనీ ప్రతినిధులు 51మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి తమ్మాజీరావు తెలిపారు. నేషనల్ కేరీర్‌ సర్వీస్ వెబ్‌ పోర్టల్‌లో అభ్యర్థులు తమ పేరు నమోదు చేసుకోవటం ద్వారా ఉపాధి ఆవకాశాలను పొందవచ్చని యంగ్ ప్రొఫెషనల్ హారిక సౌగంధి తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రావి అంకమ్మ చౌదరి, సిహెచ్ రవికిరణ్, ప్లేస్ మెంట్ అధికారి శ్రీనివాస్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

➡️