ఘనంగా అఖిలేష్ పుట్టినరోజు వేడుకలు

Jul 2,2024 00:38 ##Bapatla #AkhileshYadav

ప్రజాశక్తి – బాపట్ల
సమాజ్‌ వాది పార్టీ జాతీయ అధ్యక్షులు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 52వ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మేధా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య, విలియంబుత్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్యామ్ లివింగ్ స్టన్, సిపిఐ నాయకులు జెబి శ్రీధర్, సిఐటియు నాయకులు కె శరత్, బీసీ నాయకులు పివి శ్రీనివాసరావు, బోయిన శ్రీనివాసరావు, కె చరణ్, దర్శి భాస్కరరావు, మద్దిబోయిన తాతయ్య, వడ్లమూడి భాస్కరరావు, మోర్ల వెంకటేశ్వరరావు, కాండ్రు శరత్ కుమార్, పి సాంబశివరావు, లంబు సాంబయ్య, కొమ్మనబోయిన ఫణీంద్ర, ఎర్రాకుల వాసు, దూళిపూడి బసవయ్య పాల్గొన్నారు.

➡️