నల్ల బ్యాడ్జిలతో హెచ్‌ఎం నిరసన

Dec 14,2023 00:32

ప్రజాశక్తి – చీరాల
ప్రధానోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్‌లో బుధవారం జరిగిన స్కూల్‌ కాంప్లెక్స్ సమావేశం సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పలువురు హెచ్‌ఎంలు మాట్లాడుతూ పాఠశాల నిర్వహణ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. నాడు – నేడు ఫేజ్ 2 నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రతి ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ ఆపరేటర్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించాలని కోరారు. ప్రతినెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలని అన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎంల సంఘం నాయకులు డి రత్నకుమారి, జి శ్రీనివాసరావు, ఎం వెంకటేశ్వర్లు, కుర్రా రామారావు పాల్గొన్నారు.

➡️