జైభీం చలివేంద్రం ప్రారంభం

Apr 11,2024 23:25 ##Ambedkar #Jyothiraopule

ప్రజాశక్తి – అద్దంకి
సామాజిక విప్లవకారుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావ్‌పూలే 197వ జయంతి సందర్బంగా స్థానిక బంగ్లా రోడ్డులోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏపీ ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీస్ ఐక్యవేదిక, ప్రజా సంఘాలు, ఉద్యోగసంఘాల ఆధ్వర్యంలో ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ ఎం సత్యనారాయణ చేతుల మీదుగా గురువారం చలివేంద్రం ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి, పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మొదటి రోజు మజ్జిగ పంపిణీ చేశారు. ఎఈ గడ్డం హనుమంతరావు, గోగుల విరాంజనేయులుకు కమిషనర్ తొలుత మజ్జిగ అందజేశారు. బల్లికురవ పంచాయతీరాజ్ ఇంజనీర్ గడ్డం హనుమంతరావు, పంగులూరు విద్యాశాఖ అధికారి గోగుల విరాంజనేయులు, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు, చారిత్రక పరిశోధకులు విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, రిటైర్డ్ ఆర్‌జెడి ఉబ్బా దేవపాలన, పంగులూరు, అద్దంకి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు, ఐక్యవేదిక గౌరవ సలహాదారులు చెన్నుపల్లి వెంకటేశ్వర్లు, బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు చక్రపాణి యాదవ్, అన్నమనేని వెంకటరావు, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు కందుల గంగాధర్, ఎపి ఎస్‌సిడబ్ల్యూఎ జిల్లా అధ్యక్షులు నక్కా కాంతారావు తదితరలు సందేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు చెన్నుపల్లి నాగేశ్వరరావు, జ్యోతి శ్రీమన్నారాయణ మూర్తి, అంకం నాగరాజు, కొమ్మాలపాటి బుజ్జిబాబు, టీచర్ వి లక్ష్మీనారాయణ, బత్తుల చందు, కొప్పుల రాయుడు, దార్ల శ్రీనివాసరావు, కొంగల శ్రీనివాసరావు, ఇట్టా రామారావు, జగన్నాధం యోహాను, జగన్నాధం బాబూరావు, చింతా హరికృష్ణ, లాయర్ శివరామ్, రంజిత్ కుమార్, దైవాలరావూరు అశోక్, ఇస్టర్ల వెంకట సుబ్బారావు, మంచు హనుమంతరావు, జనరాజుపల్లి ప్రభాకర్ పాల్గొన్నారు.

➡️