పంచాయతి కార్మీకుల దీక్షలు

Dec 29,2023 23:39

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్‌
స్థానిక పంచాయతి కార్యాలయం వద్ద పంచాయితీ పారిశుద్య కార్మీకులు చేస్తున్న ధర్నాకు సిఐటియు నాయకులు జి ప్రతాప్‌ కుమార్‌ మద్దతు తెలిపారు. 7రోజుల నుండి పారిశుద్ధం కొరవడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిరసన దీక్షలు చేస్తున్నప్పటికీ పంచాయితీ అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని అన్నారు. పెండింగులో ఉన్న జీతాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో పిల్లి వెంకటేశ్వర్లు, సత్యానందం, నల్లపు రంగారావు, సుబ్బరావు, రాఘవేంద్రరావు, కాలేబు, కోటి పాల్గొన్నారు.

➡️