పిహెచ్‌సి సిబ్బంది ఫిర్యాదులపై విచారణ

Nov 28,2023 23:49

ప్రజాశక్తి – వేటపాలెం
స్థానిక బండ్ల ఆదెమ్మ ఆరోగ్య కేంద్రం నందు డిఐఓ టి వెంకటేశ్వరరావు మంగళవారం విచారణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాధమిక వైద్యశాల నుండి రెండు పిర్యాదులు అందినట్లు తెలిపారు. ఓఎస్ రూపేష్‌పై డాక్టర్స్ పట్ల, సిబ్బంది పట్ల గౌరవంగా ప్రవర్తించడం లేదని, వన్ ఆఫ్ ద స్టాఫ్‌గా డాక్టర్ సిబ్బంది పట్ల సక్రమంగా లేడని, సిబ్బంది అందరూ బాధపడుతున్నారనే రెండు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. డిఎం అండ్ హెచ్ఓ ఆదేశాల మేరకు విచారణకు విచ్చేసినట్లు చెప్పారు. సిబ్బంది దగ్గర రాతపూర్వకంగా వివరాలను పూర్తిస్థాయిలో విచారించి డిఎం అండ్‌ హెచ్ఓకు నివేదిక అందజేస్తామని తెలిపారు. ఆయన వెంట సీనియర్ అసిస్టెంట్ కోటేశ్వరరావు, జిల్లా స్టోర్స్ ఫార్మర్సిస్టు ఉన్నారు.

➡️