వ్యాపారులతో పాలేటి మాట మంచి

Mar 20,2024 23:56

ప్రజాశక్తి – చీరాల
టిడిపి అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించనున్న నేపథ్యంలో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు ఎంజిసి మార్కెట్‌లోని వస్ర్త వ్యాపారులతో మాట్లాడారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు, కామధేను కాంప్లెక్స్ అధ్యక్షులు తులాబందుల సురేష్, పెనుగొండ కిషోర్, ఎక్కల శివ మోహనరావును కలిసి వారిషాపు వద్ద సమావేశం అయ్యారు. దుకాణదారులతో ఆయన మాట్లాడారు. ఆయన వెంట తేలప్రోలు వెంకటేశ్వర్లు, పువ్వాడ రామకృష్ణ, శవనం నాగేశ్వరరెడ్డి, కామినేడి రామకృష్ణ, ఆసాది అంజిరెడ్డి, బొమ్మిడి నాగరాజు, కీర్తి కృష్ణ, గవిని మణి, కొమ్మన బోయిన సుబ్బారావు, బిజెపి నాయకులు తడవర్తి చంద్ర పాల్గొన్నారు.

➡️