ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్

Jan 6,2024 00:26

ప్రజాశక్తి – పర్చూరు
అవ్వా, తాతల దశ మారిపోయిందని వైసిపి ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్‌ అన్నారు. వారికి ఇస్తున్న పింఛన్ రూ.3వేలకు పెంచుతూ జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో ఆనందానికి అవధులు లేవని అన్నారు. స్థానిక ఎంపియుపి పాఠశాలలో శుక్రవారం జరిగిన నూతన పింఛన్ల పంపిణీ సభలో ఆయన మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వం వృద్ధులకు కేవలం రూ.వెయ్యి మాత్రమే ఇచ్చిందని గుర్తుచేశారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం మాత్రమే పింఛన్లను రూ.రెండు వేలకు పెంచిందని విమర్శించారు. జగన్ ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా పింఛన్లను దశల వారీగా పెంచినట్లు తెలిపారు. రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పింఛన్లను మాత్రం ఆపలేదని అన్నారు. కరోనా సమయంలో దేశంలోని అనేక రాష్ట్రాలు పలు సంక్షేమ పథకాలను ఆపేసినా జగన్‌ మాత్రం కొనసాగించారని చెప్పారు. పింఛన్ దారుల్లో ఎవరైనా చనిపోతేనే తప్ప టీడీపీ ప్రభుత్వం అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వలేదని విమర్శించారు. నేడు పెరిగిన పింఛన్లతో అవ్వా, తాతలు చాలా సంతోషంగా ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. మండలంలో 8749 మంది లబ్ధిదారులకు నెలకు రూ.2.59కోట్ల నగదు పింఛన్ల రూపంలో పంపిణీ చేసినట్లు ఎంపిడిఓ ప్రద్యుమ్న కుమార్ తెలిపారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు కటారి అప్పారావు, కోటా హరిప్రసాద్, సర్పంచ్ కాకర్లమూడి చిన్నయ్య, ముప్పాళ్ల రాఘవయ్య, గోరంట్ల శివకుమారి, తులసి నాగమణి, కోటా శ్రీనివాసరావు, షేక్ అహ్మద్ బాష, షేక్ కాలేష, గాదె సురేష్, ఆకుల హేమంత్, కంచెనపల్లి రమేష్, మల్లా శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి గౌస్ మోహిద్దీన్ పాల్గొన్నారు.
కారంచేడు : స్థానిక ఎంపీడీఒ కార్యాలయంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను ఎంపిపి నీరుకట్టు వాసుబాబు పంపిణీ చేశారు. మండలానికి 276నూతన ఫించన్లు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఒ లక్ష్మి నారాయణ, ఈఓఆర్డి ఆర్ రమేష్ బాబు, కోఆప్షన్ సభ్యులు ముల్లా నూర్ అహ్మద్, వైసీపీ నాయకులు దండ చౌదరి బాబు, సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


అద్దంకి : ప్రభుత్వం అందిస్తున్న పథకాలను లబ్ధిదారులు వినియోగించు కోవాలని వైసిపి ఇన్చార్జి పానెం హనిమిరెడ్డి అన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో రూ.3వేలకు పెంచిన పెన్షన్లను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసిపి పరిశీలకులు మారం వెంకారెడ్డి, ఎంపిపి అవిశన జ్యోతి, ఎంపిడిఒ దేవసేన కుమారి, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, వైసిపి మండల కన్వీనర్ పాల్గొన్నారు.


వేమూరు : చుండూరులో వైఎస్సార్ ఫంక్షన్ కానుకను వైసిపి ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జాలాద్ రూబెన్, చుండూరు సర్పంచ్ ఉయ్యూరు అప్పిరెడ్డి, ఎంపిడిఓ సుగుణమ్మ, తహశీల్దారు కనకదుర్గ పాల్గొన్నారు.

➡️