ఏలూరి సమక్షంలో టిడిపిలో చేరిక

Mar 30,2024 00:06 ##tdp #yeluri

ప్రజాశక్తి – చినగంజాం
ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు సమక్షంలో చిన్నగంజాం చెందిన నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు రామాంజనేయులు టిడిపిలో చేరారు. ఆయనతోపాటు మరో 15కుటుంబాలు చేరారు. వారికి ఎంఎల్‌ఎ ఏలూరి టిడిపి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నాయి బ్రాహ్మణ నాయకులు మాచవరపు కృష్ణ, సంఘం ఉపాధ్యక్షులు మాచవరపు బాలసుబ్రమణ్యం, మాచవరపు శ్రీనివాసులు, మాచవరపు మల్లికార్జున, మాచవరపు లక్ష్మయ్య, మాచవరపు వెంకటరత్నం, కొండపాటూరి మాధురి, మార్కాపురం నాగేశ్వరి, సేవా సంఘం అధ్యక్షులు కొండపాటూరి వెంకటేష్ టిడిపిలో చేరారు.

➡️