సమిష్టి కృషితో వైసిపిని గెలిపిద్దాం

Feb 6,2024 23:19

ప్రజాశక్తి – చీరాల
నియోజకవర్గంలో వైసిపి గెలుపుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కలిసి కృషి చేయాలని వైసిపి ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు కోరారు. నియోజకవర్గంలోని వైసిపి నాయకులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి బలోపితానికి క్షేత్రస్థాయిలో సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. గడిచిన నాలుగేళ్లలో జగన్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించాలని కోరారు. ప్రతి కుటుంబం ప్రభుత్వం నుండి పొందిన మేలును గుర్తు చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరినీ వైసిపికి ఓటు వేసే విధంగా చైతన్యం చేయాలని అన్నారు. ఎలాంటి మద్య వర్తులు లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన తీరును వివరించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ల గవిని శ్రీనివాసరావు, మల్లి వైష్ణవి, చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్లు బొనిగల జైసన్‌బాబు, రామసుబ్బులు, వైసిపి పట్టణ అధ్యక్షులు కొండ్రు బాబ్జి, గుంటూరు మాధవరావు, వైసిపి మండల అధ్యక్షులు ఆసాది అంకాళరెడ్డి, వేటపాలెం అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు పాల్గొన్నారు.

➡️