డాలర్ రౌండ్ టేబుల్‌కు ఎల్ఐసి వరబాబు

Dec 19,2023 00:33

ప్రజాశక్తి – బాపట్ల
జీవిత భీమా సంస్థలో ఏజెంట్‌గా చేరిన 8యేళ్ళలో 5సార్లు అమెరికాలో జరిగే మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ సమావేశాలకు ఎల్ఐసి ఏజెంటు జయం వరబాబు అర్హత సాధించారని బ్రాంచ్ మేనేజర్ జి గోపాల్ తెలిపారు. మేనేజర్ మాట్లాడుతూ ఎల్ఐసిలో తక్కువ కాలంలో వరుసగా 5సార్లు యూఎస్ఏలో జరిగే మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ సమావేశానికి అర్హత సాధించడం బాపట్ల ఎల్ఐసి శాఖకే గర్వకారణమని అన్నారు. ఎంతో కృషి, ఓర్పు, పట్టుదలతో యూఎస్ఏలో డాలర్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకానున్న వరబాబును అభినందించారు. కార్యక్రమంలో ఎబీఎం సుమన్, డిఓ కౌండిన్య, వెంకటేశ్వరరావు, రవి కిరణ్, రాఘవేంద్రరావు, బి సాంబయ్య, రాజేష్, గౌరీ శంకర్, ఎస్ శ్రీను, ఐ శ్రీను పాల్గొన్నారు.

➡️