ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి

Nov 29,2023 00:16

ప్రజాశక్తి – భట్టిప్రోలు
సంఘసంస్కర్త, కుల నిర్మూలన పోరాట యోధులు మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ డివి లలిత కుమారి, జెడ్పిటిసి ఉదయ భాస్కరి, ఎంపీడీఒ గుమ్మా చంద్రశేఖర్‌ మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కె పిచ్చయ్యశాస్త్రి, తహశీల్దారు ధూళిపూడి వెంకటేశ్వరరావు, ఇఓపిఆర్డి ఊహారాణి, ఏఒ శిరీష, వైసిపి నాయకులు బాలాజీ, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

అద్దంకి : మహాత్మ జ్యోతిరావ్ పూలే 133వ వర్ధంతి సందర్భంగా స్థానిక బంగళారోడ్డులోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా మంగళవారం నిర్వహించారు. విద్వాన్ జ్యోతి చంద్రమౌళి మాట్లాడుతూ దేశంలో మహాత్మ బిరుదు పొందిన ఒకేఒక్కరు పూలే అని అన్నారు. భారతదేశ మొట్టమొదటి సామజిక విప్లవకారుడని అన్నారు. మహిళల విద్యకోసం, సమానత్వం కోసం, అంటరానితన నిర్ములన కోసం, మత మౌడ్యాన్ని పారద్రోలి చైతన్యం కలిగించి, దేశంలో స్త్రీలకొరకు పాఠశాలలు స్థాపించిన మొట్ట మొదటి వ్యక్తి పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు, ఏఎస్ఓ రావూరి అమర్నాథ్, ట్రెజరర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు అంకం నాగరాజు, ఏజిపి యర్రమోతు రమేష్ బాబు, మేదరమెట్ల మాజీ సర్పంచ్ జజ్జర ఆనందరావు, జ్యోతి డేవిడ్, సయ్యద్ ఖాసీం, హుసేన్, మంచు హనుమంతరావు, జనరజుపల్లి ప్రభాకారరావు, కెవి కంప్యూటర్స్ విజయ్ బాబు పాల్గొన్నారు.

బాపట్ల రూరల్ : మహాత్మ జ్యోతిరావు పూలే తొలి సంస్కరణ ఉధ్యమకారులని రావూరి నరసింహ వర్మ కొనియాడారు. సాహితీ భారతీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన పూలే 133వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. సమాజంలో దురాచారాలను రూపుమాపటానికి పూలే అహర్నిశలు కృషి చేశారని అన్నారు. సత్యశోధక్ సమాజ్ స్థాపించారని, దీనబంధు పత్రిక నడిపారని అన్నారు. కార్యక్రమంలో సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు, హిందీ పడిట్‌ అబ్దుల్ ఖాదర్ జిలానీ, ఆదం షఫీ, ఎన్ కృష్ణ, ఎం జాకబ్, శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్ర మూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు, రెంటాల మురళీరాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

రేపల్లె : దేశంలో నెలకొన్న సామాజిక అసమానతలు, దురాగతాలపై అలుపెరగని పోరాటాలు చేసిన యోధుడు మహాత్మ జ్యోతిబాపూలే అని జై భీమ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు దోవా రమేష్ రాంజీ అన్నారు. జ్యోతిబా ఫూలే 133వ వర్ధంతి మంగళవారం నిర్వహించారు. మహారాష్ట్ర సతారా జిల్లా మాలి కులంలో జన్మించిన మహాత్మ జ్యోతిబా ఫూలే చిన్ననాటి నుండి సమాజంలో శూద్ర కులాలు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షత, అణచివేతలను గ్రహించి విద్య ద్వారానే సమాజ చైతన్యం సాధ్యమవుతుందని తన భార్య సావిత్రిభాయి ఫూలే ద్వారా ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా పాఠశాల ప్రారంభించారని అననారు. మహిళలకు విద్యా బుద్ధులు నేర్పించడం ద్వారా స్త్రీ జనోద్ధారకుడుగా నిలిచారని పేర్కొన్నారు. సత్యశోధక సమాజం స్థాపించి కార్మిక చట్టాలు, మహిళా హక్కులు, మత దురాచారాలపై అనేక సాంఘిక, ప్రజా చైతన్య ఉధ్యమాలు చేపట్టారని అన్నారు. గులాంగిరి పుస్తకాన్ని రచించి రాచరికపు విధానాలపై ప్రశ్నించిన ఆధునిక నవయుగ సామాజిక విప్లవోద్యమ పితామహుడు జ్యోతిబా ఫూలే అన్నారు. జ్యోతిబా ఫూలే ఆలోచన విధానాన్ని అనుసరించి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫూలేను తన గురువుగా స్వయం ప్రకటన చేసుకున్నారని గుర్తు చేశారు. దేశంలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రుగ్మతలు రూపు మాపిన నాడే ఫూలేకు నిజమైన నివాళులని అన్నారు. పట్టణంలో ఫూలే విగ్రహ ఏర్పాటుకు మున్సిపల్ కౌన్సిల్ అధికారులు సత్వరమే కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జైభీమ్‌ పార్టీ మండల కన్వీనర్ కర్రా బాబురావు, నేరుసు వెంకటరావు నాయుడు, రెవరెండ్ జి మాథ్యూ, జూలకంటి ఏసుబాబు, షేక్ కరీముల్లా, బోడి రాంబాబు, కారుమూరు మధుబాబు పాల్గొన్నారు.

పర్చూరు : స్థానిక వైసిపి కార్యాలయంలో చీరాల మాజీ శాసనసభ్యులు, పర్చూరు వైసిపి ఇంఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైసిపి పర్చూరు మండల కన్వీనర్ కఠారి అప్పారావు, జెసిఎస్ కన్వీనర్ ముప్పాళ్ళ రాఘవయ్య, ఆకుల హేమంత్, జంగా అనీల్, కోటా శ్రీనివాసరావు, ఒగ్గిశెట్టి ప్రసాదు, లంకా శివ, కొమ్మాలపాటి శివయ్య, సిరిగిరి బ్రహ్మయ్య, మల్లంపాటి చెంచు బాబు, పర్చూరు మాజీ వైస్ ప్రెసిడెంట్ గాదె సురేష్, గోగుల పూర్ణయ్య, కంచనపల్లి రమేష్, కొక్కిరాల చిన్ని, కటారి ప్రసన్న, గొల్లపూడి సర్పంచ్ రామకృష్ణ, కొల్లా రామకృష్ణ, కొల్లా శ్రీహరి పాల్గొన్నారు.

➡️