నష్టం అంచనాలు తయారు చేయండి : అధికారులకు కలెక్టర్ రంజిత్ భాష ఆదేశం

Dec 7,2023 00:36

ప్రజాశక్తి – చెరుకుపల్లి
వర్షాలకు నష్టపోయిన పంట నష్టం జాబితాలను సక్రమంగా తయారు చేసి నివేదిక అందజేయాలని కలెక్టర్ రంజిత్ భాష అధికారులను ఆదేశించారు. మండలంలోని కనగాల గ్రామంలో వర్షాలకు తడిసిన వరి పైరును ఆయన బుధవారం పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. పంట నష్టం వివరాలను వ్యవసాయ శాఖ సక్రమంగా రూపొందించి నివేదికలు అందజేయాలని కోరారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట రేపల్లె ఆర్డిఓ హేలా షారోన్, ప్రత్యేక అధికారి తమ్మాజీరావు, తహశీల్దారు బి వెంకటేశ్వర్లు, ఎఒ టి బాలాజీ గంగాధర్ పాల్గొన్నారు.

➡️