బెల్లంకొండకు నివాళి అర్పించిన మంత్రి గొట్టిపాటి

ప్రజాశక్తి – పంగులూరు
మండలంలోని చందలూరు పిఎసిఎస్ మాజీ అధ్యక్షుడు, తెలుగుదేశం నాయకుడు బెల్లంకొండ దశరధ రామయ్య చిత్రపటానికి విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఘనంగా నివాళి అర్పించారు. గ్రామంలోని దశరధ రామయ్య ఇంటికి శుక్రవారం మద్యాహ్నం మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గ్రామంలో తెలుగుదేశం అభివృద్ధికి దశరధ రామయ్య ఎంతో కృషి చేశారని అన్నారు. ఆటుపోట్లను తట్టుకొని పార్టీని నిలబెట్టడంలో ఆయన కృషి మరువలేనిది అన్నారు. తనకు చాలా కాలం నుండి దశరథ రామయ్యతో పరిచయం ఉందని అన్నారు. నిజాయితీ, నిబద్ధత గల వ్యక్తిగా ఆయన పని చేశారని చెప్పారు. ఆదర్శవంతమైన వ్యక్తిని కొనియాడారు. ఆయన కుటుంబానికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. అంతకు ముందు గ్రామంలోని మహిళలు, టిడిపి కార్యకర్తలు మంత్రి రవికుమార్‌ను గ్రామంలోని రామాలయానికి తీసుకువెళ్లి అక్కడ కొబ్బరికాయలు కొట్టించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కరి వెంకట సుబ్బారావు, టిడిపి మండల అధ్యక్షులు రావూరి రమేష్ బాబు, పెంట్యాల రాధాకృష్ణ, పెంట్యాల రామలింగస్వామి, చింతల సహదేవుడు, గుర్రం ఆదిశేకర్, బోరెడ్డి ఓబులురెడ్డి, మాగులూరి రమేష్ బాబు, మాజీ సర్పంచ్ ఉన్నం రవి, జాగర్లమూడి సుబ్బారావు (జెకేసి), గరిమిడి జగన్ మోహనరావు పాల్గొన్నారు.

➡️