మూడు చక్రాల స్కూటర్ అందజేసిన మంత్రి గొట్టిపాటి

ప్రజాశక్తి – పంగులూరు
మండలంలోని తూర్పు కొప్పెరపాడు గ్రామానికి చెందిన నీలం హనుమంతరావు అనే వికలాంగునికి మూడు చక్రాల స్కూటర్‌ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం అందజేశారు. హనుమంతరావుకు ఏడాదిన్నర క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. నడువలేని స్థితిలో ఉన్న ఆయన విషయం టిడిపి నాయకులు ఒకసారి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికలైన తర్వాత మూడు చక్రాల స్కూటర్‌ను ఏర్పాటు చేద్దామని అప్పుడు హామీ ఇచ్చారు. శుక్రవారం చందలూరు వెళుతున్న మంత్రి రవికుమార్ మార్గమధ్యంలో కొప్పెరపాడులో ఆగి నీలం హనుమంతరావుకు మూడు చక్రాల స్కూటర్‌ను అందజేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మంత్రి రవికుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గొల్లపూడి ఆంజనేయులు, మాజీ సర్పంచ్ పెంట్యాల సుబ్బారావు, తెలుగుదేశం కొప్పెరపాడు ఏరియా కోఆర్డినేటర్ ఎనికపాటి అశోక్, ఎనికపాటి సూరిబాబు, జాగర్లమూడి విష్ణు, రావూరి అశోక్, వై స్టాలిన్ బాబు పాల్గొన్నారు.

➡️