అధికారుల పనితీరు మెరుగుపరచుకోవాలి : ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య

ప్రజాశక్తి – వేటపాలెం
వ్యవసాయ శాఖ అధికారుల పనితీరు మెరుగుపర్చుకోవాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య సూచించారు. మండలంలోని అక్కయపాలెం రైతు భరోసా కేంద్రం వద్ద మండల స్థాయి వ్యవసాయశాఖ సిబ్బంది (ఆర్బికె) ఇన్‌పుట్ డీలర్స్‌కు శిక్షణ నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండి రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఎప్పుడు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా వ్యవసాయ శాఖ సిబ్బంది పనిచేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రామకృష్ణ, చీరాల, వేటపాలెం మండలాల్లో సాగు చేసే విస్తీర్ణం, సాగు చేసే పంటలు, వివిధ అంశాల గురించి తెలిపారు. చీరాల ఎడిఎ నియోజకవర్గ స్థాయిలో పండే ప్రథమ పంటల గురించి వివరించారు. ఉద్యానవన పంటలను ఆ శాఖ అధికారి వివరించారు. మండలానికి కేటాయించిన భూసార పరీక్షల మట్టి నమూనాలు వీలైనంత తొందరగా తీసి పరీక్షకు పంపాలని చెప్పారు. డిఎఎటీటీసీ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు ఉషచ బాలమురళీధర్ నాయక్ మట్టి నమూనాలు ఎలా స్వీకరించాలో క్లుప్తంగా తెలిపారు. కార్యక్రమంలో డిడిఎ విజయనిర్మల, ఎడిఎ ఎఫ్రాయం, చీరాల, వేటపాలెం, చిన్నగంజం ఎఒలు, ఏఈఓలు, వీహెచ్ఎలు, ఎపిసిఎన్ఎఫ్ సిబ్బంది, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️