కార్యకర్తలకు ఎంపీ మోపిదేవి పరామర్శ

Jan 7,2024 23:40

ప్రజాశక్తి – చెరుకుపల్లి
అనారోగ్యంతో చికిత్స పొందిన కార్యకర్తను, రోడ్డు ప్రమాదంలో గాయపడిన కార్యకర్తను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు ఆదివారం పరామర్శించారు. మండలంలోని కనగాల గ్రామానికి చెందిన చేనేత సహకార సంఘం నాయకులు రాచా బత్తునిలక్ష్మీ నరుసు, ఇటీవల అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకోగా అయినను పరామర్శించారు. గూడవల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ నలిగల నాగేశ్వరరావు కుమారుడు నాని ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఆయనను పరామర్శించారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ ఏడుకొండలురెడ్డి పాల్గొన్నారు.

➡️