గొట్టిపాటిని కలసిన ఎంఆర్‌పిఎస్ నాయకులు

Jun 18,2024 00:36 ##minister #Gottipati #Mrps

ప్రజాశక్తి – చీరాల
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహజన సోషలిస్టు పార్టీ ప్రతినిధులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను సోమవారం కలిశారు. ముప్పవరం క్యాంపు కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. పూల మాలతో సత్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎంఆర్‌పిఎస్‌ అనుబంధ శ్రేణులన్ని గొట్టిపాటి విజయానికి పూర్తి స్థాయిలో పనిచేసినట్లు తెలిపారు. తెలుగుదేశం గెలుపులో భాగస్వామ్యమైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్‌పి జిల్లా అధ్యక్షులు బుడంగుంట్ల లక్ష్మీ నరసయ్య ‌మాదిగ, ఎంఆర్‌పిఎస్‌ జిల్లా అధ్యక్షులు దుడ్డు వందనం మాదిగ, ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు వంగెవరపు రమేష్, మంద ఆమోస్, పునూరి నరేంద్ర, పల్లెపోగు నాని, మారుతి ప్రసాదు, తేళ్శ శ్రీనివాసరావు, మహేంద్ర, పేతురు, పునూరి రమేష్, రాము, ఎలీషా, అబ్రహాం, ప్రతాప్ పాల్గొన్నారు.

➡️