కోమలి బీచ్ రిసార్ట్స్ ప్రారంభించిన నరేంద్రవర్మ

Jun 16,2024 23:27 ##Bapatla #MLA #Narendravarma

ప్రజాశక్తి – బాపట్ల
పర్యాటక కేంద్రంగా బాపట్లకు అత్యంత సమీపంలో అభివృద్ధి చెందుతున్న సూర్యలంక బీచ్ సందర్శకులకు ప్రైవేటు రంగంలో విలాస వంతమైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్న కోమలి బీచ్ రిసార్ట్స్ యాజమాన్యం సేవలు అభినందనీయమని శాసన సభ్యులు నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల – సూర్యలంక రహదారి మార్గంలో ముత్తాయపాలెం సమీపంలో అన్ని హంగులతో నిర్మించిన కోమలి బీచ్ రిసార్ట్స్‌ను నరేంద్ర వర్మ రాజు ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో రిసార్ట్స్ నిర్వాహకులు ఉప్పల వీరాస్వామి, జి చార్వాక, కె ధనేంద్ర, టిడిపి పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️