జాతీయ వాటర్‌ ఛాపియన్‌ గాయత్రి

ప్రజాశక్తి – నగరం
స్థానిక శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల విద్యార్థిని నాగిడి గాయత్రి (2బిసిఎ) ఇటీవల కర్ణాటకలోని దండేలేలో జరిగిన నేషనల్ వాటర్ ఛాంపియన్షిప్‌లో ద్వితీయ స్థానం, నేషనల్ టీం ఛాంపియన్షిప్‌లో ద్వితీయ స్థానం పొందినారు. ఈ సందర్భంగా కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనగాని హరికృష్ణ అధ్యక్షత వహించారు. అంతర్జాతీయ స్థాయిలో నాగిడి గాయత్రి కాలేజీ పేరు ప్రఖ్యాతలను తీసుకువెళ్లిందని అభినందించారు. విద్యార్థులు అందరూ బాగా కష్టపడి ఎంచుకున్న రంగంలో పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. కళాశాల సెక్రెటరీ, కరస్పాండెంట్ వల్లభనేని బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ చదువుల్లో, క్రీడల్లో విద్యార్థులకు ఎటువంటి సహాయ సహకారలైన యాజమాన్యం అందిస్తుందని అన్నారు. గాయత్రికి అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనడం అభినంద నీయమని అన్నారు. ఆమెకు ఏవిధమైన సహాయ సహకారాలైనా అందిస్తామని తెలిపారు. వాటర్‌ స్పోర్ట్స్‌ కోచ్‌ టి సాంబశివరెడ్డి మాట్లాడుతూ మరింత మెరుగైన నైపుణ్యంతో అద్భుత అవకాశాలు అందుకుని అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో పీజీ డైరెక్టర్ డాక్టర్ కేసిన సురేంద్రబాబు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మాగంటి సుధాకరరావు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి వెంకటనారాయణ, ఫిజికల్ డైరెక్టర్ సాంబమూర్తి, సూపర్నెంట్ పి అమరేష్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️