నవ బుద్ధిష్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్

May 23,2024 23:00 ##Battiprolu #Ambedkar

ప్రజాశక్తి – భట్టిప్రోలు
శాంతి, సమానత్వం, సౌబ్రాతృత్వం కోసం పాటు పడిన గౌతమ బుద్ధుని ఆశయాలను అనుకరిస్తూ నవ బుద్ధిష్టుడిగా మారిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని ఆది ఆంధ్ర నవ బుద్ధిష్టు సొసైటీ అధ్యక్షుడు, న్యాయవాది రమేష్ రాంజీ పేర్కొన్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుద్ధ జయంతిని మండలంలోని కోళ్లపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గౌతమ బుద్ధుని విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. దేశంలో కుల, మతాలు ప్రాంతాల వారీగా విడిపోయిన భారత సమూహాన్ని భిన్నత్వంలో ఏకత్వంగా ఏకం చేసి భారతవనికి డాక్టర్‌ బిఆర్ అంబేద్కర్ నవ బుద్ధిష్టుడయ్యారని కొనియాడారు. రేపల్లె ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందాలంటే భట్టిప్రోలు బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. బౌద్ధ స్తూపం వద్ద బుద్ధుని విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ పాలకుల విధివిధానాల కారణంగా నిలిచిపోయిందని అన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాలతో కృష్ణానది తీర ప్రాంతాల్లో బౌద్ధారామాన్ని అభివృద్ధి చేసేందుకు తమ సొసైటీ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఐలు రాష్ట్ర కన్వీనర్ గోరుముచ్చు శాంత కుమార్, గుదేటి సురేష్ కుమార్, బ్రహ్మేశ్వరరావు, కూరపాటి కిషోర్, పంతగాని నాగేశ్వరరావు, కర్ర బాబురావు, లంక శివ, వెంకటేశ్వరరావు, జక్కల భాను పాల్గొన్నారు.

➡️