ఏలూరి గెలుపు ఎవ్వరూ ఆపలేరు

Feb 4,2024 22:26

ప్రజాశక్తి – పర్చూరు
సిఎం వైఎస్‌ జగన్ ఎన్నికుట్రలు చేసినా పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గెలుపుని ఆపడం అసాధ్యమని టిడిపి బాపట్ల పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు తిరుమలశెట్టి శ్రీను అన్నారు. స్థానిక టిడిపి ఆఫీసులో ఆదివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఎంఎల్‌ఎ ఏలూరితోపాటు టిడిపి నాయకులపై అక్రమ కేసులు, అరెస్టులను ఖండించారు. కొద్ది రోజుల క్రితం కర్రలు, కారం ప్యాకెట్లతో వైసిపి గూండాలు మైనింగ్ అధికారులతో కలిసి మార్టూరు గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీలకు వచ్చారని, దానిని అడ్డుకొని ప్రశ్నించిన ఎమ్మెల్యే ఏలూరితో పాటు టిడిపి నాయకులు, ఫ్యాక్టరీ యజమానులపై అక్రమ కేసులూ బనాయించి అరెస్ట్ చేయటం వైసిపి ప్రభుత్వానికే చెల్లుబాటవుతుందని అన్నారు. వైసిపి గూండాలను వదిలేసి పిర్యాదు చేయటానికి వచ్చిన టిడిపి నాయకులపై కేసులు పెట్టడం అన్యాయం అన్నారు. అక్రమ కేసులతో ఎమ్మెల్యే ఏలూరి ప్రతిష్టను తగ్గించలేరని అన్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలు చేయటం సూర్యుడిపై ఉమ్మి వేయడమెనని అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నేతల కనుసన్నల్లోనే అవినీతి రాజ్యమేలుతుందని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా నియోజకవర్గంలో సహజవనరులైన ఇసుక, మట్టిని, గ్రానైట్ దోచేస్తు రూ.కోట్లు దోచుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే ఏలూరిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొన లేకనే జగన్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా పర్చూరు అభివృద్ధి ప్రదాత ఏలూరి గెలుపును ఆపడం అసాధ్యం అన్నారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హ్యాట్రిక్ విజయం సాధించటం ఖాయమని అన్నారు. వైసిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చేది తెలుగుదేశం – జనాసేన ప్రభుత్వమేనని అన్నారు. కార్యక్రమంలో టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇండ్ల శ్రీనివాసరావు, మీడియా కోఆర్డినేటర్ ఇండ్ల శ్రీనివాసరావు, పాలపర్తి శ్రీను, పొన్నరుసు వెంకటేశ్వర్లు, లింగేశ్వరరావు, చెంచమ్మ, పేరం శోభన్, పెరం శ్రీను, పొట్లూరి శ్రీను, కోటి, బాబు, నాగేశ్వరమమ, పోతురాజు, పూనురి ఆంజనేయులు పాల్గొన్నారు.

➡️