ఇసుక అక్రమ తరలింపుపై అధికారులు చర్యలు

Mar 20,2024 23:46

ప్రజాశక్తి – భట్టిప్రోలు
అక్రమంగా ఇసుక తరలిస్తుండటంతో పోలీసులు స్వాదీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగిస్తున్నారు. మూడు రోజుల క్రితం జువ్వలపాలెంకు చెందిన రెండు ట్రాక్టర్ల వద్ద సరైన బిల్లులు లేకపోవడంతో అదులు లుపులోకి తీసుకుని తహశీల్దారుకు పోలీసులు అప్పగించారు. దీనిపై మైనింగ్ అధికారులకు సొమ్మును చెల్లింపు చేసుకొని ట్రాక్టర్లను విడుదల చేసేందుకు మూడు రోజుల నుండి చలానా రాసి కూడా టాక్టర్లను అట్లాగే ఉంచారు. ఈ విషయాన్ని ఎంపీపీ, జడ్పీటీసీలు తహశీల్దారు దృష్టికి తెచ్చారు. చలానా కట్టించుకుని ట్రాక్టర్లను వదిలిపెట్టాలని కోరారు. తహశీల్దారు స్పందించకపోవడంతో బుధవారం వైసిపి ఇన్చార్జి వరకూ అశోక బాబు జోక్యం చేసుకుని రసీదులు రాసి సొమ్మును తీసుకుని ఎందుకు విడుదల చేయటం లేదని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉండగా పార్టీ అభ్యర్థి తహశీల్దారు కార్యాలయానికి రావడాన్ని ఓ విలేకరి ఫోటో తీశాడు. దీంతో ఫోటో దేనికి తీస్తున్నావని అతన్నీ ప్రశించారు. ఎన్నికల కోడలు అమలు వండగా మీరు ఎందుకు వచ్చారంటూ విలేఖరి ఎదురు ప్రశ్నించగా ఇరువురి మధ్య వాగ్వివాదం నెలకొంది. అక్కడున్న కొందరు సర్ది చెప్పి విలేకరిని అక్కడ నుండి పంపించి వేశారు. ఈ విషయం మండలంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

➡️