చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం

ప్రజాశక్తి – అద్దంకి
పట్టణంలోని నరసరావుపేట రోడ్డులోని శ్రీ వీరబ్రహ్మేంద్రబ్రిక్ ఇండస్ట్రీ ఆవరణలో టీడీపీ విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీ కన్వీనర్ తువ్వపాటి జనార్ధనాచారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, అద్దంకి ఎమ్మెల్యేగా గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు పార్లమెంటు ఎంపీగా మాగంటి శ్రీనివాసులురెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధించినందుకు కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. వీరి పాలనలో అట్టడుగునున్న బీసీలు, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ముందుకు వెళ్తారనే ఆశ భావం వ్యక్తం చేశారు. వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు చెన్నుపల్లి కోటిలింగాచారి, జాగర్లమూడి శ్రీనివాసరావు, బీసీ నాయకులు రవిచంద్రచారి, విశ్వబ్రాహ్మణ సంఘ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుందుర్తి సీతారామాంజనేయులు, టీడీపీ నాయకులు ఏజెండ్ల ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి పొన్నపల్లి బ్రహ్మానందం, ఆళ్లగడ్డ వీర సుందరాచారి, ముత్తలూరు హరిబాబు, గుండెమెడ వెంకటేశ్వర్లు, ఏలూరు వీర బ్రహ్మచారి, మహిళ నాయకురాలు లీలా కుమారి, లాయర్ బహునాదం నాగాచారి, తెనాలి బ్రహ్మం పాల్గొన్నారు.

➡️