నిజాయితీకి ప్రజాశక్తి మారుపేరు

Dec 29,2023 00:27

ప్రజాశక్తి – రేపల్లె
నిజాలను నిర్భయంగా రాసే ఏకైక పత్రిక ప్రజాశక్తి అని ఎంఎల్‌ఎ అనగానీ సత్యప్రసాద్ అన్నారు. అంగన్‌వాడీల సమ్మె శిబిరం వద్ద ప్రజాశక్తి 2024క్యాలెండర్ ఆవిష్కరించారు. ప్రజాశక్తి పత్రిక అన్ని రంగాలలో తనదైన శైలిలో వార్త కథనాలను అందిస్తోందన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ మణిలాల్, నల్లూరుపాలెం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరవల్లి శివరామకృష్ణ, జనసేన ఇన్‌ఛార్జి మత్తి భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యే ముమ్మనెని వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.


భట్టిప్రోలు : నీతి, నిజాయితీగా, సమర్థవంతమైన వార్తలు సేకరించి అందించడంలో ప్రజాశక్తి ముందుంటుందని ఎంపీపీ డివి లలిత కుమారి అన్నారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో 2024 ప్రజాశక్తి క్యాలెండర్ ఆమె గురువారం ఆవిష్కరించారు. పార్టీలకతీతంగా, నిజాన్ని నిర్భయంగా ప్రజలకు అందించడంలో ప్రజాశక్తి ముందు వరుసలో నిలుస్తుందని అన్నారు. ప్రజాశక్తి దిన పత్రిక మరింత బలోపేతం కావాలని అన్నారు. కార్యక్రమంలో తహశీల్దారు ధూళిపూడి వెంకటేశ్వరరావు, ఇన్చార్జి ఎండిఓ జలజ, ఈఒ పిఆర్డి ఊహారాణి, ఎఈ రావూరి సౌమ్య రేవతి, భట్టిప్రోలు, ఐలవరం, వెల్లటూరు పంచాయితీ కార్యదర్శులు కోట శ్రీనివాసరావు, గోలి శ్రీనివాసరావు, రామ్ కుమార్, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.


వేమూరు : ప్రజాశక్తి దిన పత్రిక 2024 క్యాలెండర్‌ను టిడిపి నాయకులు గురువారం ఆవిష్కరించారు. ప్రస్తుతం రాష్ట్రం పరిణామాలను నిశితంగా పరిశీలించి ప్రజలకు తెలియజేసే పత్రిక ప్రజాశక్తి అని టిడిపి రాష్ట్ర కార్యదర్శి తనుగుంట్ల సాయిబాబా పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురిస్తుందని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కంభం సుధీర్, జయశీలరావు, సుందరరావు, సాంసన్ పాల్గొన్నారు.

➡️