పుణ్యభూమి పుస్తకావిష్కరణ

Mar 11,2024 00:14

ప్రజాశక్తి – అద్దంకి
సాహితీ మిత్ర మండలి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ పురస్కార సభకు లక్కరాజు చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. ఓరుగంటి శ్రీనివాసరావు సభాహ్వానం చేశారు. సన్మాన గ్రహీత పరిచయాన్ని కుందా సుబ్బారావు గావించారు. కవయిత్రి ఐవి సుబ్బాయమ్మ రచించిన ‘పుణ్యభూమి ‘ పుస్తకాన్ని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి ఆవిష్కరించారు. మన దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన దేశభక్తులన్ని గురించి సరళ సుందరంగా నేటి యువతకు స్ఫూర్తి నిచ్చే విధంగా మంచి కవితలు రాశారని అన్నారు. వీరు రచించిన కావ్యాలపై వారణాసి రఘురామశర్మ, గాడేపల్లి దివాకర దత్తు, ఇలపావులూరి శేషతల్ప శాయి, లక్కరాజు శ్రీనివాసరావు మాట్లాడారు. సన్మాన కార్యక్రమ వ్యాఖ్యాతగా లక్కరాజు సాంబశివరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఎం రాధాకృష్ణమూర్తి, సంకాబాబు, కంఠంరాజు శివరామ కోటేశ్వరరావు, చెన్నుపాటి రామాంజనేయులు, మారం కోటేశ్వరరావు, ఎస్‌వి కిషన్‌రావు, అప్పరాజు నాగేశ్వరరావు, లక్కరాజ రాము, రావినూతల సీతాదేవి, పుట్టంరాజు శైలజ, కార్యదర్శి కెవి పోలిరెడ్డి, వామరాజు వెంకటేశ్వర్లు, చిన్ని మురళీకృష్ణ, ఓరుగంటి ప్రసాదరావు, లక్కరాజు విశ్వమోహన్, కొండకావూరి కుమార్, మిట్టా కామేశ్వరశర్మ, అద్దంకి లెవీప్రసాదు, కోలలపూడి శ్రీనివాసరావు, గోపినాథం హరనాథ్, సందిరెడ్డి వెంకటేశ్వర్లు, ఊటుకూరి రామకోటేశ్వరరావు, మారం కోటేశ్వరరావు, ఆర్‌వి రాఘవరావు, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, ధేనువకొండ సుబ్బారావు, అంగలకుర్తి ప్రసాదు, నర్రా శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

➡️