మినుము పంటలో పూసా హైడ్రోజెల్

Nov 27,2023 23:31

ప్రజాశక్తి – వేటపాలెం
మెట్ట పంటల్లో తేమను పట్టివుంచి పంటకు అవసరమైనపుడు వర్షాభావ పరిస్థితుల్లో నీటిని విడుదల చేయు పూసా హైడ్రోజెల్ అనే గుళికల్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మండలంలోని పాపాయిపాలెం గ్రామంలో ఆత్మ పథకం ప్రకాశం ట్రైనింగ్ కో ఆర్డినేటర్, బాపట్ల డిఆర్సి సహాయ సంచాలకులు, చీరాల కోఆర్డినేటర్, బాపట్ల ఏరువాక కేంద్రం సాంకేతిక సహాయంతో గ్రామానికి చెందిన రైతు కరాంకి శ్రీనివాసరావు వ్యవసాయ క్షేత్రంలో మినుము పంటలో పూసా హైడ్రోజెల్‌ నిర్వహించారు. మినుము విత్తే ముందు ఒక కిలో పూసా హైడ్రోజెల్‌ను ఇసుకలో కలిపి ఎకరం విస్తీర్ణంలో సమంగా వెదజల్లిన తర్వాత విత్తన శుద్ది చేసిన మినుము, టిబిజి 104రకం విత్త నాన్ని వెద జల్లించారు. బెట్ట పరిస్థితుల్లో పంటను పరిశీలించి, ఇతర రైతుల పంట కన్న ఎంత మెరుగ్గా దిగుబడి నిచ్చినదో నమోదు చేయాలని నిర్ణయంచినట్లు జిల్లా వనరుల కేంద్రం, జిల్లా ట్రైనింగ్ కోఆర్డినేటర్, ఎం విజయ నిర్మల తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల ఏరువాక కేంద్రం ఎంసి ఓబయ్య, చీరాల ఎడిఎ ఎఫ్రాయం, ఎఒ ఐ కాశీ విశ్వనాథ్, బి ఉమా మహేశ్వరి పాల్గొన్నారు.

➡️