న్యాయవాది యార్లగడ్డకు సత్కారం

Mar 7,2024 00:22

ప్రజాశక్తి – పర్చూరు
న్యాయవాద వృత్తి 40ఏళ్లు పూర్తయిన సందర్భంగా యార్లగడ్డ వెంకటేశ్వరరావు బార్ అసోసియేషన్‌కు రూ.40వేల విరాళం అందజేశారు. బార్‌ అసోసియేషన్‌ సమావేశంలో నగదును అసోసియేషన్ అధ్యక్షులు కొల్లా నరేంద్ర కుమార్‌కు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొల్లా నరేంద్ర కుమార్, రావి శ్రీనివాసరావు, న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు రావి సత్యనారాయణ, చాగంటి సుబ్బారావు, పోతిన సురేంద్ర, రావి రమేష్ బాబు, మేకల రవీంద్రనాథరెడ్డి, వీరాంజనేయులు, కట్టా సాల్మన్, తులసి రాజేష్, దగ్గుబాటి రాఘవయ్య చౌదరి, వెంగళశెట్టి తిరుమలరావు పాల్గొన్నారు.

➡️