ఫార్మ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపిక

Feb 3,2024 23:51

ప్రజాశక్తి – వేటపాలెం
సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో ముంబాయి ప్రధాన కేంద్రంగా కలిగిన అలింబిక్ ఫార్మసూటికల్స్ లిమిటెడ్ కంపెనీ ఎంబిఎ, ఫార్మసి విద్యార్థులకు ఇటీవల క్యాంపస్ ఎంపికలు నిర్వహించింది. ఎంపికల్లో 12 విద్యార్థులు ఉద్యోగాలు సాదించినట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు తెలిపారు. ఫార్మాసూటికల్ కంపెనీలలో ఒక్కటైన అలెంబిక్ ఫార్మమాలికల్స్కంపెనీ 1907లో స్థాపించబడిన బహుళజాతి కంపెనీ క్యాంపస్ రిక్రూట్ మెంట్ ప్రతినిధులు మొదటగా కంపెనీ ఆవిర్భావం, కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, ఎంపిక కాబోయే విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు, భాధ్యతలు, కంపెని కల్పించే సౌకర్యాలు ఆన్లైన్లో పవర్ పాయింట్ ద్వారా తెలిపారు. ఎంపికలకు 40మంది హాజరు కాగా 12మంది ఉద్యోగాలు సాధించారని ప్రిన్సిపాల్ ఎం వేణుగోపాలరావు, ప్రాంగణ ఎంపికల అధికార ఎన్ పూర్ణచంద్రరావు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రు.3లక్షల జీతం, ఇతర అలవెన్సులు ఇస్తారని తెలిపారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ఫార్మసి ప్రిన్సిపాల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్‌వి రమణమూర్తి, ఎంబిఎ విభాగాధిపతి డాక్టర్ ఆర్ ఇమ్మానియేల్ అభినందించారు.

➡️