ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలకు ఎంపిక

Feb 13,2024 01:07

ప్రజాశక్తి – వేటపాలెం
ప్రాంగణ ఎంపికల్లో ఎఐ కంపెనీకి 8 మంది విద్యార్ధులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరి వనమ రామకృష్ణారావు సోమవారం తెలిపారు. ఇటీవల ఎఐ కంపెనీ ప్రాంగణ ఎంపికలు బిటెక్ ఆఖరి సంవత్సరం విద్యార్ధులకు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్‌ ఎం వేణు గోపాలరావు తెలిపారు. 420మంది హాజరు కాగా 8ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్ధులకు ఏడాదికి రు.2.5లక్షల నుండి రు.4లక్షల వరకు సామర్థ్యంను బట్టి వేతనం, ఇతర సౌకర్యాలు ఇస్తారని ప్రాంగణ ఎంపికల అధికారి నూతలపాటి పూర్ణచంద్రరావు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఫార్మసి ప్రిన్సిపాల్ వివి నాగేశ్వరరావు, హెచ్‌ఒడిలు పి హరిణి, కె జగదీశ్ బాబు, సి హరికిషన్, ఎస్‌ ఇంద్రనీల్, మేనేజర్ ఆర్‌వి రమణమూర్తి అభినందించారు.

➡️