చిరుధాన్యాలపై సెమినార్‌

Dec 7,2023 23:31

ప్రజాశక్తి – నగరం
స్థానిక శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలలో 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా కళాశాలలో గురువాం సెమినార్‌ నిర్వహించారు. డ్రామాలు, వ్యాసరచన పోటీలు, రిలేలు నిర్వహించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ పూషడపు వెంకటనారాయణ అధ్యక్షత వహించి మాట్లాడారు. చిరుధాన్యాలు శారీరక, మానసిక, దృఢత్వానికి, ఎదుగుదలకు దోహదపడతాయని అన్నారు. వీటి ద్వారా అనారోగ్య సమస్యలు నివారించవచ్చని తెలిపారు. కళాశాల ఎన్‌సిసి అధికారి వి సాంబమూర్తి మాట్లాడుతూ చిరుధాన్యాలు పీచు పదార్థాలను కలిగి ఉంటాయని అన్నారు. ఇవి అరుగుదలకు, మధుమేహం వ్యాధిగ్రస్తులకు చాలా మంచిదని అన్నారు. పిల్లలు, వృద్ధులకు కావలసిన పోషకాలు ఎక్కువగా ఉండడం చేత దేశంలో వీటి వాడకం ఎక్కువగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మాగంటి సుధాకరరావు, ఐక్యు ఎసి కోఆర్డినేటర్ ప్రసన్నబాబు, శ్రీదేవి, ఆఫీసు సూపరిండెంట్ అమరేష్‌రెడ్డి పాల్గొన్నారు

➡️