ఉత్తమ ఫలితాలు సాధించిన శ్రీ మేధావి

Jun 16,2024 23:36 ##Chirala #SriMedhaVi

ప్రజాశక్తి – చీరాల
ఇంటర్‌, ఎంసెట్‌ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు శ్రీమేధావి జూనియర్‌ కాలేజీ డైరెక్టర్‌ ఎంవి దుర్గాకుమార్‌ తెలిపారు. విద్యా సంవత్సరం పున ప్రారంభం సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈనెల 19న బుధవారం నుండి ఇంటర్‌ తగతులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జూనియర్‌ ఇంటర్‌ ఎంపిలో ఎం భవ్యశ్రీ, ఎ నవ్య అనే ఇద్దరు విద్యార్ధులు 464మార్కులు, బైపిసిలో ఐఎల్‌ గ్రిష్మంత్‌ 428మార్కులు, ఎంఇసిలో ఎంఎస్‌ఎల్‌ హర్షిత 479 మార్కులు, జూనియర్‌ ఇంటర్‌ సిఇసిలో విఎస్‌ శ్రీహర్షిణి 446మార్కులు, సీనియర్‌ ఇంటర్‌ ఎంపిసిలో జి వీణప్రసన్న 986మార్కులు, సీనియర్‌ ఇంటర్‌ బైపిసిలో ఎల్‌ కనకదుర్గ 977మార్కులు సాధించి పట్టణ, జిల్లా స్థాయిలో నిలిచినట్లు తెలిపారు. ఎంసెట్‌ మెడిసిన్‌లో బి విజయలక్ష్మి 2589వ ర్యాంకు, ఇంజనీరింగ్‌లో టి సాహితి 11278వ ర్యాంకుతోపాటు ఇంజనీరింగ్‌లో 15వేల లోపు ర్యాంకులు మరో ఎనిమిది మంది సాధించినట్లు తెలిపారు. ఇంటర్‌ పరీక్షలతోపాటు ఎంసెట్‌, నీట్‌, ఐఐటి, సిఎ వంటి పోటీ పరీక్షలకు విద్యార్ధులను సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. మారుతున్న పోటీకి తగినట్లు విదా్యర్ధులను తీర్చి దిద్దుతున్నట్లు తెలిపారు.

➡️